Bhairav
ఇది 2009 లో జరిగిన యదార్థ సంఘటన. వివరంగా చెప్పాలంటే బోల్డన్ని పేజీలవుతాయి. మా దగ్గర ఒక కుక్క పిల్ల ఉండేది . భైరవ్ దాని పేరు. మా ఆవిడకు కుక్కలన్నా పిల్లులన్నా పడేది కాదు . నాకు మా పిల్లలకు మాత్రం కుక్క పిల్ల అంటే భలే సరదా. ఎప్పుడు పెంచుకుందామనుకున్నా మా ఆవిడ పడనిచ్చేది కాదు. కొంత మెలోడ్రామాటిక్ మలుపులు జరిగాక మొత్తానికి మా ఇంటికి 45 రోజుల కుక్క పిల్లని తెచ్చుకోగలిగాం. మిగతా విషయాలన్నీ పక్కన పెడితే, ఒక రోజు భైరవ్ మా ఇంటినించి తప్పించుకొని పోయింది. అప్పుడు దాని వయసు ఒక సంవత్సరం ఉండొచ్చు. చిన్న కుక్క పిల్ల, మేడలో బెల్టు తో లబ్రడోర్ ఎంతో ముద్దుగా ఉండేది అందరం దానిని వొదిలి వుండే వాళ్ళం కాదు. భార్య భర్తలం ఇద్దరం ఉద్యోగులం పిల్లలిద్దరూ స్కూల్ కాలేజీ లైనా ఎవరో ఒకరు తొందరగా రావడమో లేదా ఎగ్గొట్టటమో చేసేవాళ్ళం . ఇంటికి వొచ్చేసరికి మీద పడి ఛంపేసేది. ఆ పాటికి భైరవ్ మా ఇంట్లో నే కాదు పక్కింట్లో, ఎదురింట్లో, పేపర్ వాడికి, పాల వాడికి, మా ఇంటి గుండా వేళ్ళ స్కూల్ పిల్లలకి, అందరికి పరిచయం అయిపోయింది . మా బంధువులైతే మా కోసం తక్కువ దానికోసం ఎక్కువ వోచేవాళ్ళు . ఇక విషయానికి వొస్తే, ఉదయాన్నే భైరవ్...