Maha Kumbh Mela
నా సోలోట్రిప్ దురద ఈసారి ప్రయాగరాజ్ మహాకుంభ్ కు దారి తీసింది.
అసలు ఈసారి సోలో ట్రిప్ మూడ్ అంత సీరియస్ గా రాలేదు. ఈలోగా మహాకుంభ్ దొరికింది దాంతో కాస్త కిక్.
విషయానికి వస్తే, ఫ్లైట్ లో వెళ్ళి ఫ్లైట్ లో తిరిగి రావడానికి 2 రోజులు పడుతుంది. 3 రోజులు ప్లాన్ చేసుకుంటే మంచిది.
ఎయిర్పోర్ట్ నించి ఒక గంట ప్రయాణం. మధ్యాహ్నానికి చేరుతుంది కాబట్టి ఆరోజు కుంబ్ ప్రాంగణం కవర్ చేసుకొని తర్వాతి రోజు ఉదయాన్నే బోట్స్ క్లబ్ కి వెళ్తే అక్కడ బోట్లు మాట్లాడుకొని సంగం కి ఒక గంట ప్రయాణం చేసి వెళ్లి స్నానం చేసి ఎవన్నా పితృ కార్యాలు జరపాలంటే కానిచ్చి వొచ్చేయచ్చు. వొడ్డునించి కూడా సంగమ స్నానం చేస్తారు కానీ గంగ యమున కలిసే చోటు నది మద్యలో ఉంటుంది అంటారు అక్కడ సరస్వతి అంతర్వాహిని కనిపించదు. అందుకని అక్కడ చేయగలిగితే శ్రేష్టం అంటారు. గంగా నీళ్లు తెల్లగా, యమున నీళ్లు నల్లగా తెలుస్తుంది అక్కడైతే.
హోటల్ ఆన్ లైన్ బుక్ చేస్కోండి. 5000 నుండి 50000 వరకు హోటల్ రేట్ ఉంటుంది. హోటల్ నించి ఆటో, బోట్, మిగతా వాటికి ఒక 10000 ఇద్దరికి ఖర్చు అవుతుంది. వీలైతే బడి హనుమాన్ మందిరం కవర్ చెయ్యండి.
రష్ ఉంటుంది కానీ పెద్ద ఇబ్బంది ఉండదు. హాలిడే రోజు నుమాయిష్ ఎలా ఉంటుందో ఒక పిసరు ఎక్కువ. పేపర్ వార్తలు, టీవీ వార్తలు, పట్టించుకోవద్దు. హయిగా వెళ్లి సంగమ స్నానం చేసి వొచ్చేయ్యండి. తిరుపతి లో మనకు అలవాటే కదా. ఆ మాత్రం రష్ ఉండదా.
నేనయితే, హైదరాబాద్ నించి సోలో లో కార్ లో 17 జనవరి బైల్డేరి, నాగపూర్లో ఒక హల్ట్ కొట్టి, అలవాటు ప్రకారం లోకల్ ఆటో మాట్లాడుకొని చుట్టుపక్కల చూడదగ్గవి, వీలైనన్ని కవర్ చేసి, రాత్రి సుబ్బరంగా నిద్రపోయి, ఉదయాన్నే జబల్పూర్ కొట్టేశా. 5 గంటలు ప్రయాణం. హల్ట్, లోకల్ సైట్ సీయింగ్ మామూలే.
మహాకుంభ్ లాంటి పవిత్ర స్నానికి వెళ్తే, సోలో అంటే మరి బాగోదు గా. స్వామి కార్యం స్వకార్యం అని, మా ఆవిడకు 19 కి హైదరాబాద్ నించి ఫ్లైట్ లో బుక్ చేశా. నేను జబల్పూర్ నించి ఉదయమే బైల్దేరి, మా ఆవిడని ఎయిర్పోర్ట్లో పిక్ చేసుకొని, హోటల్ కి వెళ్లి పైన చెప్పినట్టుగా స్నానం చేసి పునీతులమయ్యాం. 19 న ఒక 4 స్టార్ హోటల్, 20 న ఒక టెంట్ హౌస్ బుక్ చేసుకోగలిగా, ముందే ప్లాన్ చేసుకున్న కాబట్టి.
నేను హ్యాపీ, మా ఆవిడ హ్యాపీ, సమాజం హ్యాపీ (ఏంటి ఒక్కడే వెళ్తాడా మహాకుంబ్ అనుకునేవాళ్లు బోలెడు మరి).
21 న ఉదయమే మా ఆవిడను ఎయిర్పోర్ట్లో హైదరాబాద్ కి ఎక్కించేసి, అట్నించే నేను చెక్కేసా నా సోలో ప్రయాణం లో . తిరుగు ప్రయాగ్ రాజ్ నించి, రేవా, అమర్కంటక్, రాయపూర్ (చిత్రకూట్ వాటర్ ఫాల్స్ అద్భుతం), జగదల్పూర్ ద్వారా హైదరాబాద్ కి వొచ్చేశా 25 నాటికి.
అద్దిరి పోలా - స్వామి కార్యం స్వకార్యం, పరాకార్యం.

Comments
Post a Comment