Posts

Showing posts from July, 2025

Maha Kumbh Mela

Image
  నా సోలోట్రిప్ దురద ఈసారి ప్రయాగరాజ్ మహాకుంభ్ కు దారి తీసింది. అసలు ఈసారి సోలో ట్రిప్ మూడ్ అంత సీరియస్ గా రాలేదు. ఈలోగా మహాకుంభ్ దొరికింది దాంతో కాస్త కిక్. విషయానికి వస్తే, ఫ్లైట్ లో వెళ్ళి ఫ్లైట్ లో తిరిగి రావడానికి 2 రోజులు పడుతుంది. 3 రోజులు ప్లాన్ చేసుకుంటే మంచిది. ఎయిర్పోర్ట్ నించి ఒక గంట ప్రయాణం. మధ్యాహ్నానికి చేరుతుంది కాబట్టి ఆరోజు కుంబ్ ప్రాంగణం కవర్ చేసుకొని తర్వాతి రోజు ఉదయాన్నే బోట్స్ క్లబ్ కి వెళ్తే అక్కడ బోట్లు మాట్లాడుకొని సంగం కి ఒక గంట ప్రయాణం చేసి వెళ్లి స్నానం చేసి ఎవన్నా పితృ కార్యాలు జరపాలంటే కానిచ్చి వొచ్చేయచ్చు. వొడ్డునించి కూడా సంగమ స్నానం చేస్తారు కానీ గంగ యమున కలిసే చోటు నది మద్యలో ఉంటుంది అంటారు అక్కడ సరస్వతి అంతర్వాహిని కనిపించదు. అందుకని అక్కడ చేయగలిగితే శ్రేష్టం అంటారు. గంగా నీళ్లు తెల్లగా, యమున నీళ్లు నల్లగా తెలుస్తుంది అక్కడైతే. హోటల్ ఆన్ లైన్ బుక్ చేస్కోండి. 5000 నుండి 50000 వరకు హోటల్ రేట్ ఉంటుంది. హోటల్ నించి ఆటో, బోట్, మిగతా వాటికి ఒక 10000 ఇద్దరికి ఖర్చు అవుతుంది. వీలైతే బడి హనుమాన్ మందిరం కవర్ చెయ్యండి. రష్ ఉంటుంది కానీ పెద్ద ఇబ్బంది ఉండ...

Covid effect - First Solo Trip

Image
  సోలో ఎస్కేప్ (తెలుగులో ఏమనాలో తెలియట్లేదు) ఆ మధ్యన కరోనా ఎంత దెబ్బకొట్టిందో తెలుసు కదా. దాదాపు రెండేళ్లు స్నేహితులు లేదు, బంధువులు లేదు, షాపింగ్ లేదు, సినిమాలు లేవు. వేరియంట్ల మీద వేరియంట్లు టెంట్లేస్కోని కూర్చున్నాయి. అవే ముఖాలు, అవే గోడలు. కొంత తగ్గాక కూడా ఎక్కడికెళ్ళాలన్నా భయం, ఇంట్లో ఒక్కరికి భయమేసినా ఎవ్వరు వెళ్ళడానికి లేదు. నువ్వంటించుకొని వొచ్చి మాకు కూడా తగిలిస్తావ్ టాట్ ఎక్కడికి వెళ్లడానికిలేదు కూచో. వాళ్ళు రారు మనలని పోనియ్యరు, అది దుస్థితి. పోయిన డిసెంబర్ (2021) లో బరితెగించి చెప్పేశా ఇంట్లో, నేను పారిపోతున్నా అని. మరీ ఆలా కాకున్నా ఇంచుమించు అలానే. వారం రోజులు సోలో ఎస్కేప్ అని, 29 వ తారీకు న చెప్పి, 30 న నా MG హెక్టర్ కార్ లో, ఒక్కడినే వెళ్తున్నా అని చెప్పేశా. ఇక్కడికొద్దు అక్కడికి, అదొద్దు ఇది, ఈ హోటల్ బాలేదు, ఇటొద్దు అటు తిప్పు, లే కూచో అనే వాళ్లెవరు లేకుండా బిందాస్. ఎక్కడా హోటల్ రిజర్వేషన్ చేయించుకోకుండా, ఎక్కడపడితే అక్కడ బస చేసేలా,ఎక్కడా హైవే లో వెళ్లకుండా (ఆలా వెళ్తే మజా ఏముంటుంది వొట్టి రోడ్ తప్ప జనాలు, జనావాసాలు, జంతు జాలం, పల్లెలు, పల్లెవాసులు, ఊసులు, వగైరా ...